delivery in 108

Delivery in 108 : గర్భిణీకి పురుడు పోసిన 108 సిబ్బంది

Delivery in 108 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో ఓ గర్భిణికి 108 సిబ్బంది పురుడు పోశారు. వివరాలిలా ఉన్నాయి. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన షేక్ ఘోరేబీ కి మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108 కి సమాచారం అందించారు.108 సిబ్బంది వెంటనే ఘోరేబిని ఇంటికి చేరుకొని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. ప్రసవించడానికి ఆశ కార్యకర్త ఏం.బాబాయి, పైలెట్ చాణక్య, ఈఎంటి గణేష్ వైద్యుల సూచనల మేరకు పురుడు పోశారు. ఘోరే బీ ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. అనంతరం వారిని వేములవాడ ఏరియా దవాఖానకు తరలించారు. సకాలంలో పురుడు పోసిన అంబులెన్స్ సిబ్బందికి ఘోరేబీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఘోరేబీ కి ఇది నాలుగో సంతానం. కాగా ఇద్దరమ్మాయిలు, ఒక బాబు ఉన్నారు.

శెనార్తి మీడియా, రాజన్న సిరిసిల్ల:

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *