Jitta Balakrishnareddy : సేవే చేయడమే తన లక్ష్యం సేవే మార్గం అనే పంథాలో సాగింది అతని జీవితం. ఉద్యమమే ఊపిరిగా పెట్టుకొని మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆర్థికంగా, వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి అనేక సేవలు అందించారు జిట్టా బాలకృష్ణారెడ్డి. ఈ పేరు వింటేనే నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుల నుండి వచ్చే ఆనందానికి అవధులుండవు. అందరి నాయకుల లాగా ఫ్లోరైడ్ మీద యుద్ధం చేసి చేతులు దులుపుకోలేదు. సుమారు 200పై చిలుకు గ్రామాలకు తన స్వంత పైసలు కోట్లు ఖర్చు చేసి గ్రామ గ్రామాన వాటర్ ప్లాంట్లు నెలకొల్పాడు.
రాజకీయంగా తను ఎంత కష్ట పడ్డ కూడా విజయ తీరాల రుచిని చవిచూడలేకపోయాడు. తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా ఆస్తులు అమ్ముకున్నం. రక్త మాంసాలు పెట్టినం అని గొప్పలు చెప్పుకునే ఇప్పుడున్న ఏ నాయకుడైనా జీట్టా తరువాతే. అది కేసీఆర్ అయినా, ,ఈటెల అయిన ఏ ఉద్యమకారుడైనా. తెలంగాణ జాతర పేరుతో స్వంత గడ్డ భువనగిరిలో, ఇటు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో, డిల్లీ రాంలీలా మైదానంలో తన స్వంత పైసలు కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ సంస్కృతిని, ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు. భువనగిరి గుట్ట అంత ఆస్తి కలిగిన ఉన్న జిట్ట అనే దగ్గర నుండి చివరికి ఆర్థిక కష్టాల వరకు వెళ్లిన అతని ప్రస్థానం మరువలేనిది. అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొమ్మయిపల్లి గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన జీట్టా బాలారెడ్డి,రాధమ్మ పుణ్య దంపతులల కడుపులో 14డిసెంబర్ 1972లో పుట్టిన భువనగిరి ఆశాకిరణం జిట్టా.
స్వంత ప్రయోజనాల కోసం తన కష్టాన్ని వాడుకొని చివరకు అతని మీదే నిందలు వేసిన ఎక్కడ కూడా అదరకుండా నిలబడి యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ, తనదైన శైలిలో అతని ప్రసంగాలు వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రాజకీయ పార్టీలు అతని పేరు మీద రాజకీయాలు చేస్తున్న నిశితంగా గమణించాడే తప్ప ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. నవ్వుతూ నా జీవితం ఎప్పుడు పోరాటమే అనేవాడు అంతే. రాజకీయ పార్టీలు మోసం చేసిన కూడా స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి విజయానికి కొద్ది దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చింది. నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డాడే తప్ప నమ్మిన వ్యక్తులను, వ్యవస్థలను మోసం చేయలేదు.
నల్లగొండలో నేటికీ మాట్లాడుకునే మాట రాజకీయ పార్టీలు మోసం చేశాయి కానీ నువ్వు పార్టీలను మోసం చేయలే జిట్టా అన్న అని సామాన్యులు అనుకునే మాట. నీ ఆశయం నీ ఆలోచన నీ కోరిక చివరకు నీకు కాకుండా చేసిన ఆ దేవుడు కూడా బాధపడే పరిస్థితి వచ్చిందంటే నువ్వు గర్వంగా అంతిమంగా చెరగని విజయం సాధించినట్లే. తెలంగాణ ప్రజల గుండెల్లో చివరి వరకు తెలంగాణ ఉన్నని రోజులు, ఈ సమాజం బ్రతికున్నంత కాలం నీ పేరు తెలంగాణ చరిత్రలో నిలిచే ఉంటుంది. నిలుస్తూనే ఉండాలని కోరుతుంటుంది మీ అభిమానాలోకం.
మీ అభిమాని
మామిడి వినోద్, మంథని