- పీఏసీఎస్ చైర్మన్ ప్రొద్దుటూరి సంజీవరెడ్డి
Metpalli PACS: రైతులు, సభ్యుల సహకారంతో మెట్‌పల్లి సహకారం సంఘం లాభాల బాటలో పయనిస్తున్నదని చైర్మన్ ప్రొద్దుటూరి సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం శంకరపట్నం మండలం మొలంగూర్‌లో మెట్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాసభ నిర్వహించారు. సంఘం ఆర్థిక లావాదేవీలను సీఈవో సదయ్య నివేదిక చదివి వినిపించారు. సందర్భంగా చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడారు. సహకార సంఘంలో తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించి సంఘం తోడ్పాటుకు సభ్యులు సహకరించాలని కోరారు. ఇటీవల రూ. 7 కోట్ల మేర పంట రుణాలు ప్రభుత్వ మాఫీ చేసిందన్నారు. సభ్యులకు ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్ల పై రుణాలు అందిస్తున్నామని తెలిపారు. సభ్యుల పిల్లలకు విదేశీ విద్యా రుణాలు కూడా అందిస్తున్నామని వివరించారు. ఈ అవకాశాలను సంఘం సభ్యులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, బోడ సుధాకర్, బోనగిరి ఐలయ్య, కవ్వ పద్మ, మాడ రాజిరెడ్డి, కాల్వ వెంకటరమణారెడ్డి, కాటం బుచ్చిరెడ్డి, అంగిడి సారయ్య, బత్తుల రవి, గాజుల సంపత్, రవి, చంద్రారెడ్డి గాజుల మహేష్, మోరే శ్రీను,రాయిని రమేష్, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా,శంకరపట్నం