Singareni : మందమర్రి ఏరియా కేకే-5 గనిలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కేకే-5(KK-5 Mine) గని రెండో షిప్టు కోల్ కట్టర్ విధులకు లక్ష్మణ్ (33) అనే కార్మికుడు హాజరయ్యాడు. విధులు ముగించుకుని గని నుంచి తిరిగి వస్తుండగా.. మెయిన్ రైడింగ్ నుంచి లక్ష్మణ్ కిందపడి మృతి చెందాడు. మృతుడు లక్ష్మణ్ నివాసం శ్రీపతినగర్ అని, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. ప్రమాదం గురించి తెలుసుకున్న కార్మిక నాయకులు రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుడు లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం చేయాలని సలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్ , ఐఎన్ టీయూసీ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు డీవీ భూమయ్య, సెంట్రల్ కమిటీ నాయకులు కంపల్లి సమ్మయ్య డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల రక్షణ, సంక్షేమానికి రూ. కోట్లు వెచ్చించి ప్రగల్భాలు పలికే సింగరేణి యాజమాన్యం కేకే-5 గనిలో సాగదీయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల