Ramagundam CP Inspections
Ramagundam CP Inspections

Ramagundam CP : బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి

శెనార్తి మీడియా, మంచిర్యాల :

Ramagundam CP : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని, విచారణ చేపట్టి వారికి సత్వర న్యాయం చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ ను రామగుండం సీపీ బుధవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ ముందుగా ఠాణా పరిసరాలను సందర్శించారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలు, వారి   విధులు, పనితీరు,  పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదు ల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులు కు న్యాయం జరిగేలా చూడాలి అన్నారు. బ్లూ క్లోల్ట్స్ సిబ్బంది తో మాట్లాడి డయల్ 100 కాల్స్ కి స్పందన, సంఘటన స్థలానికి  చేరుకొన్న టైం వివరాలు ట్యాబ్ లో చెక్ చేశారు. రాత్రి వేళల్లో  ఫింగర్ ప్రింట్ డివైస్ తో అనుమానితుల ఫింగర్ ప్రింట్స్ తప్పనిసరిగా సేకరించాలన్నారు. పెట్రో కార్ వాహనంలలో ఫస్ట్ ఎయిడ్ కిట్, డ్రాగన్ లైట్, రోప్స్, కోన్స్, క్రైమ్ ప్రొటాక్ట్  రిబ్బన్, రైట్ గేర్ కిట్( హెల్మెట్, స్టోన్ గార్డ్, లాఠీ, బాడీ ఫ్రొటెక్టర్) లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బ్లూ క్లోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయంలో రౌడీ షీటర్స్ కేడీలు, డీసీలు, సస్పెక్ట్ షీట్స్ ఇళ్లను, ఇంపార్టెంట్ పాయింట్ బుక్స్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, ఫిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలన్నారు. గంజాయి మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ సీఐ మోహన్, జైపూర్ ఎస్ఐ రవి ఉన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *