Love Jihad: లవ్ జిహాద్’పై మరింత కఠినంగా వ్యవహరించాలని యూపీలోని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రకమైన నేరం చేసినట్లు రుజువైతే జీవిత ఖైదుతో విధించనున్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును యోగి ప్రభుత్వం సోమవారం సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులో అనేక నేరాలకు శిక్షలను రెట్టింపు చేశారు. లవ్ జిహాద్ కింద కొత్త నేరాలను కూడా చేర్చారు. ఈ బిల్లులో, చట్టవిరుద్ధంగా మత మార్పిడికి నిధులను చట్టం కింద నేరాల పరిధిలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి, యోగి ప్రభుత్వం 2020లో లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా మొదటిసారి చట్టాన్ని రూపొందించింది. దానిని మరింత కఠినతరం చేసే ఆర్డినెన్స్‌ను జూలై 29న సభలో ప్రవేశ పెట్టింది. జూలై 30న సభలో ఆమోదం పొందనుంది.
ఇప్పటి వరకు 10 ఏళ్ల జైలు శిక్ష నిబంధన
యూపీ ప్రభుత్వం గతంలో మత మార్పిడి నిరోధక బిల్లు 2021ని అసెంబ్లీలో ఆమోదించింది. ఈ బిల్లులో ఏడాది నుంచి పదేళ్ల దాకా శిక్ష విధించే నిబంధన ఉంది. ఈ బిల్లు ప్రకారం, కేవలం వివాహం కోసం చేసే మత మార్పిడి చెల్లదు. అబద్ధాలు చెప్పడం లేదా మోసం చేయడం ద్వారా మతం మారడం నేరంగా పరిగణించబడుతుంది. స్వచ్ఛందంగా మత మార్పిడి జరిగితే, మేజిస్ట్రేట్‌కు 2 నెలల ముందుగానే సమాచారం ఇవ్వాలి. బిల్లు ప్రకారం, బలవంతంగా లేదా మోసపూరితంగా మతమార్పిడి చేస్తే ఏడాది నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్షతో పాటు రూ.15వేలు జరిమానా విధించే నిబంధన ఉంది. దళిత యువతికి ఇలా జరిగితే మూడేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించే నిబంధన ఉంది.
రాష్ట్రంలో లవ్ జిహాద్ ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం యోగి పలుమార్లు ఆదేశాలు జారీ చేశారు. మాయమాటలు చెప్పి హిందూ యువతులను ప్రేమలోకి దించే ఘటనలను సహించేది లేదని స్పష్టం చేశారు. 2023లో లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ ఒక హిందూ కుటుంబం తమ కూతురు నమాజ్ చేస్తుండడాన్ని చూసింది. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాలికను గట్టిగా నిలదీయగా ఆమె ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకున్నట్లు తేలింది. మతం కూడా మార్చుకున్నట్లు చెప్పింది. దీని తర్వాత, కుటుంబ సభ్యులు బాలిక వస్తువులను వెతకగా, ఆమెను అమన్ అనే అబ్బాయి ట్రాప్ చేశాడని గుర్తించారు. అతను రాసిన పలు లేఖలు బయటపడ్డాయి. ముస్లిం అబ్బాయికి దూరంగా ఉండాలని అమ్మాయిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశార. కానీ ఆమె అంగీకరించకపోవడంతో పాటు ఆ అబ్బాయితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.