Make up in Savan
Make up in Savan

Makeup : శ్రావణంలో మహిళలు సింగారించుకోవచ్చా ?

Makeup : హిందూ మతంలో పవిత్ర శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు శివారాధనకు ఎంతో ఉత్తమమైనది. చాలా మంది ఈ మాసంలో తమ ఇష్ట దైవాలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. శివపార్వతులను పూజించడంతో పాటు, శ్రావణంలో ఉపవాసం(fasting) ఉంటే ప్రయోజనాలు ఉంటాయని భక్తుల నమ్మకం. భక్తులు తమ శక్తి సామర్థ్యాల మేరకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉపవాసం ఉంటుంటారు. వివాహిత మహిళలు, అమ్మాయియిలు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. మేకప్ కోసం పలు సౌందర్య ఉత్పత్తులను వాడుతుంటారు. పాదాలకు కలబంద అప్లై చేస్తారు. కళ్లకు కాటుక పెట్టుకుంటారు. అత్యంత ఇష్టమైన నగలు ధరిస్తారు. మేకప్ అప్లై చేయడం వల్ల మంచిగ కనిపించడంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నమ్ముతారు. మేకప్ వేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందని ఆశ్చర్యపోవచ్చు. కానీ వైద్య నిపుణులు కూడా మేకప్ తో కలిగే సానుకూల ప్రభావం మానసిక ఆరోగ్యంపైనా చూపుతుందని చెబుతున్నారు .మేకప్ మానసిక ఆరోగ్యాన్ని ఎలా పెంచుతుందో తెలుసకుందాం.

సింగారించుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

మేకప్ వేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒక వ్యక్తి ఆత్మగౌరవం, విశ్వాసం, మానసిక సమతుల్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మేకప్ వేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
మేకప్ వేసుకోవడం వల్ల ఒక వ్యక్తి తన యొక్క మంచి అనుభూతిని పొందుతాడు. ఈ విధంగా ఆత్మగౌరవం, విశ్వాసం పెరుగుతుంది.
మేకప్ అప్లై చేయడం కూడా ఒక రకమైన సెల్ఫ్ కేర్ లాంటిదే. అందువల్ల ఇది మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చుతుంది. స్వీయ సంరక్షణ సహాయంతో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు. మేకప్ సహాయంతో మరింత సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చు. దీంతో మనస్సు సంతృప్తి, ఆనందాన్ని పొందుతుంది. మేకప్‌ను క్రమం తప్పకుండా వేసుకోవడం ద్వారా క్రమశిక్షణ, క్రమానుగత దినచర్యను అలవర్చుతుంది. ఇది మానసిక స్థిరత్వానికి మేలు చేస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. నిత్యం అలసట నుంచి ఉపశమనం కలిగించే సానుకూల అంశం.
మేకప్ ధరించడం సామాజిక పరస్పర చర్యలను మెరుగుపరుస్తుంది. ఒక వ్యక్తి మంచిగా భావించినప్పుడు, వారిపై ఇతర వ్యక్తులు మరింత సానుకూలంగా, నమ్మకంగా వ్యవహరిస్తారు.

మేకప్ తో సంతోషం :

డిప్రెషన్ అనేది ప్రపంచమంతటా పెద్ద సమస్యగా పరిణమించింది. మహిళల్లో, డిప్రెషన్ కేసులు పురుషుల కంటే ఎక్కువగా కనిపిస్తుంటాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో రెండు బృందం రెండుగా ఏర్పడ్డాయి, ఒక గ్రూప్ మేకప్ చేయమని, మరొక బృందం మేకప్ వద్దని అడిగింది. ఈ అధ్యయనం మేకప్ వేసుకున్న వ్యక్తుల సమూహం వారి వ్యక్తిగత ఇమేజ్ పట్ల సానుకూలంగా, నమ్మకంగా ఉన్నట్లు కనిపించింది. మేకప్ వేసుకోని వారు తమ వ్యక్తిగత ఇమేజ్ గురించి తక్కువ సానుకూల ఆలోచనలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *