minister sridharbabu

Minister Sridhar Babu: పొట్ట కొట్టొద్దని మంత్రి కాళ్లపై పడ్డడు

రోడ్డున పడేయవద్దని మంత్రి శ్రీధర్ బాబు కాళ్లు మొక్కని కాంట్రాక్ట్ కార్మికుడు

Minister Sridhar Babu: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఎల్లంపల్లి పర్యటనకు రాగా, ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ఒక్కసారిగా వచ్చి కాళ్లు మొక్కాడు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను మంత్రి శ్రీధర్ బాబు సందర్శనకు వచ్చిన సందర్బంలో కాంట్రాక్ట్ కార్మికుడు లక్ష్మయ్య ఒక్కసారిగా మంత్రి శ్రీధర్ బాబు కాళ్లపై పడ్డాడు. 18 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తామని ఇరిగేషన్ సీఈ సుధాకర్ రెడ్డి తెలిపారని, మమ్మల్ని రోడ్డున పడేయవద్దంటూ మంత్రిని వేడుకున్నాడు. తమను రెగ్యులర్ చేసి జీవోనోపాధి కల్పించాలని వేడుకున్నాడు. పొట్టకూటి కోసం ఏండ్ల తరబడి చాాలిచాలనీ జీతాలతో  పనిచేస్తున్న తమను తొలగిస్తే జీవనం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశాడు.

శెనార్తి మీడియా, మంచిర్యాల:

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *