education

Civils Coaching: ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ లో ఉచిత శిక్షణ

education
education

మంచిర్యాల జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గంగారాం

Civils Coaching: యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2024 కోసం రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎస్టీ అభ్యర్థులకు అందించే ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి గంగారాం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్షియల్ పద్దతిలో మెయిన్స్ శిక్షణ సన్నద్ధం అయ్యేందుకు మెంటార్ గైడెన్స్ తో పాటు ఒక టాబ్, ఉచిత భోజన వసతి కల్పించనున్నట్లు తెలిపారు అభ్యర్థులు యూపీఎస్సీఎస్సీ(UPSCSC)- ప్రిలిమినరీ పరీక్ష-2024 లో ఉత్తీర్ణులై మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించి ఉండాలని వివరించారు. వివరాలకు 7382620487, 7093466985 లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *