Adilabad SP
Adilabad SP

Ganja Catch : తలమడగులో రూ.2.25 కోట్ల గంజాయి పట్టివేత

కంటెయినర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
ఆరుగురు నిందితులు పరార్

Ganja Catch : అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్‌ జిల్లా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం మహారాష్ట్ర సరిహద్దులో లక్ష్మీపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఈ ముఠాలోని ఇద్దరిని బుధవారం అరెస్ట్‌ చేశారు. ఆరుగురు నిందితులు పరారయ్యారు.

ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయిన సరఫరా చేస్తున్నదని పోలీసులు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన కంటెయినర్‌ ఆదిలాబాద్‌ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా పోలీసులు తనిఖీల్లో పట్టుబడింది. కంటెయినర్‌ లో 292 ప్యాకెట్లలో 9 క్వింటాళ్ల గంజాయి దొరికింది. పట్టుకున్న గంజాయి విలువ దాదాపు రూ.2.25 కోట్లు ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్‌ ఆలం వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులో ఎస్పీ గౌస్ ఆలం
స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులో ఎస్పీ గౌస్ ఆలం

పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కంటెయినర్‌ డ్రైవర్‌ వసీమ్‌ అన్సారి, క్లీనర్‌ అర్మాన్‌ ఉన్నారు. పరారైన వారిలో ఒడిశా రాష్ట్రం మల్కాజిగిరికి చెందిన ఆశిష్, ఉత్తర ప్రదేశ్ లోని మీరట్‌కు చెందిన పండిత్‌జీ, మహారాష్ట్రలోని బుల్దాన, దులే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఉత్తరాఖండ్‌కు చెందిన అన్షుజైన్, సోను అన్సారీ ఉన్నారు. నిందితుల నుంచి ఐచర్‌ కంటైనర్‌, 292 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.

శెనార్తి మీడియా, తలమడుగు

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *