Sports : కేశవపట్నం మోడల్ స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడాపోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ సరిత తెలిపారు. సీఈసీ ఫస్టియర్ విద్యార్థి పి అనిల్ కరీంనగర్ జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి జోనల్ స్థాయికి ఎంపికయ్యాడు. బైపీసీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఎండీ యాస్మిన్ తైక్వాండోలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రిన్సిపల్ సరిత, ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో పీఈటీలు తిరుపతి, మోహన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, శంకరపట్నం