YS Jagan Record
YS Jagan Record

YS JAGAN : వైఎస్ జగన్ మెజార్టీ రికార్డు బ్రేక్

YS JAGAN : తెలంగాణలో హోరాహోరీగా సాగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన స్థానాలను పదిలం చేసుకుంది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోటీ సాగింది. కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రభావం చూపించారు. గెలిచిన స్థానాల్లోనూ భారీ మెజార్టీ తో విజయం అందుకున్నారు. నల్గొండ (Nalgonda) పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పెద్ద కుమారుడు కుందూరు రఘవీర్ రెడ్డి అఖండ విజయయం సాధించారు. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై ఏకంగా 5.51 లక్షల భారీ మెజార్టీతో గెలుపొంది విజయ బావుటా ఎగరేశారు. మెజార్టీలో రికార్డు సృష్టించారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ కావటం విశేషం. దీంతో.. జనారెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించటమే కాకుండా.. రఘువీర్ రెడ్డి కొత్త రికార్డు క్రియేట్ చేశారు.

గతంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీవీ నర్సింహారావు అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు దేశంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో మూడో వ్యక్తి కూడా పీవ నర్సింహరావే. 1991లో కర్నూలు జిల్లాలోని నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పీవీ నర్సింహరావు 5.8 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్‌పై విజయం సాధించారు. 2011లో కాంగ్రెస్‌ నుంచి కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 5.43 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. జగన్ మోహన్ రెడ్డి రికార్డను రికార్డును రఘువీర్ రెడ్డి బ్రేక్ చేశారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన మూడో ఎంపీ పసునూరి దయాకర్. 2015లో వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పసునూరి దయాకర్ 4.59 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో.. దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీల్లో ఏడో వ్యక్తిగా పసునూరి నిలిచారు.

ఇదిలా ఉంటే.. జనారెడ్డి చిన్న కుమారుడు కే జయవీర్ రెడ్డి సైతం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కుందూరు జయవీర్ రెడ్డి తన తండ్రి కుందూరు జానారెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌పై 55849 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *