గ్రూపుల్లో చురుకైన కమ్యూనికేషన్‌కి మరింత తోడ్పాటు
whatsapp new features: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులను కలిగిన వాట్సాప్ తాజాగా పలు ఫీచర్లతో యాప్‌ను అప్‌డేట్ చేసింది. గ్రూప్ చాట్‌లు, వాయిస్, వీడియో కాల్స్ వంటి అంశాలను మరింత సులభతరం చేస్తూ, వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచే దిశగా ఇవి రూపొందించబడ్డాయి.
తాజాగా వచ్చిన ఫీచర్లలో “గ్రూప్ ఆన్‌లైన్ స్టేటస్” ఒకటి. దీని ద్వారా, ఒక గ్రూప్ చాట్‌లో ప్రస్తుతం ఎవరెవరు ఆన్‌లైన్‌లో ఉన్నారో గ్రూప్ పేరుకింద కనిపిస్తుంది. సమయాన్ని ఆదా చేయడమేకాకుండా, చురుకైన సంభాషణలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
మరొక కొత్త ఫీచర్ “హైలైట్ నోటిఫికేషన్స్(Highlight Notifications)”. వినియోగదారులు ప్రత్యేకంగా కొంతమంది సందేశాలు లేదా ప్రస్తావనలు మాత్రమే నోటిఫికేషన్‌ల రూపంలో పొందాలనుకుంటే, సెట్టింగ్స్‌లో ఈ ఎంపికను సవరించవచ్చు. ముఖ్యంగా బిజీ షెడ్యూల్ ఉన్నవారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
అదే విధంగా, చాట్‌లలో “ఈవెంట్(Event)” ఆప్షన్‌ను పరిచయం చేశారు. ఇది ఒక రిమైండర్ లాంటి విధంగా పనిచేస్తుంది. మీరు ఎవరితోనైనా ఈవెంట్ ప్లాన్ చేసి, అది ఏ రోజు, ఏ సమయానికి జరుగుతుందో స్పష్టంగా చాట్‌లో పొందుపరచవచ్చు.
“రిఅాక్షన్ కౌంట్” అనే ఫీచర్ ద్వారా, మీ సందేశానికి ఎంతమంది స్పందించారో చూడొచ్చు. ఇది గ్రూప్ చాట్‌ల్లో సమగ్ర విశ్లేషణకు దోహదపడుతుంది.
ఐఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన స్కాన్ డాక్యుమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు స్కానింగ్ చేయబోయే పత్రాలను నేరుగా వాట్సాప్ ద్వారా పంపే అవకాశం ఉంది. అదనంగా, వాట్సాప్‌ను డిఫాల్ట్ కాలింగ్, మెసేజింగ్ యాప్‌గా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఐఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.
వీడియో కాల్స్‌లో “జూమ్(Zoom)” ఫీచర్‌ను తీసుకొచ్చారు. కాల్ జరుగుతుండగానే, చాట్ విండో నుంచే మరొకరిని జోడించే “యాడ్ టు కాల్” ఎంపిక అందుబాటులోకి వచ్చింది. కాలింగ్ నాణ్యతను మెరుగుపరిచిన ఈ అప్‌డేట్ వల్ల కాల్ డ్రాప్‌లు, ఫ్రీజింగ్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
చివరిగా, వాట్సాప్ ఛానెల్ ఫీచర్ మరింత అభివృద్ధి చెందింది. 60 సెకన్ల వీడియో నోట్స్‌ను నేరుగా ఛానెల్ ద్వారా పంపే అవకాశం, వాయిస్ ట్రాన్స్క్రిప్ట్ సదుపాయం, అలాగే చానెల్ లింక్‌కు బదులుగా QR కోడ్‌ను పంపించే ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు.