మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డీ వెంకటేశ్వర్ రావు
Vayojana Vidya :నిరక్షరాస్యులైన వయోజనులను 100 రోజులలో 100 శాతం అక్షరాస్యత సాధించేలా కృషి చేస్తామని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డీ వెంకటేశ్వర్ రావు అన్నారు. మంగళవారం కాసిపేట మండలం ధర్మారావుపేట రైతు వేదిక, మల్కెపల్లి లోని ఐకేపీ హాలులో వయోజన విద్యశాఖ, సఖి లయన్స్- మంచిర్యాల సౌజన్యంతో అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తంనాయక్ తో కలిసి మాట్లాడారు. అక్షరాస్యత ద్వారా మానవ మనుగడతో పాటు నవసమాజ నిర్మాణం, నవ కల్పన, నాగరికత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చన్నారు. కుట్టు శిక్షణ ద్వారా స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబాన్ని మెరుగుపరుచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు నేటి ఆధునిక విధానానికి అనుగుణంగా మెళకువలు నేర్చుకొని సమాజంలో అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. అక్షరాస్యత శాతాన్ని పెంపొందించడంలో సహకారం అందిస్తున్న సఖి లయన్స్-మంచిర్యాల, పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (Peoples Education trust)స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని అన్నారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తూ తీరిక వేళల్లో వయోజన విద్యకు సహకరిస్తూ సంపూర్ణ అక్షరాస్యతలో భాగస్వాములు అవుతున్న జిల్లా డీఆర్పీలను అభినందించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి సఫ్టర్ అలీ, డీఆర్పీలు బండ శాంకరి, రెడ్డిమల్ల ప్రకాశం, పోకల వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శులు, సఖి లయన్స్ ప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, మంచిర్యాల