ఆందోళన చెందుతున్న మత్స్యకారులు రైతులు.!
Damera Cheruvu : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన దామెర చెరువు(Damera Cheruvu )తూము షెటర్ ను ను గుర్తుతెలియని వ్యక్తులు పైకి లేపడంతో మూడు, నాలుగు రోజులగా చెరువు నుంచి పెద్ద ఎత్తున నీరు వృథాగా పోతున్నది. దీనిపైన రైతులు,మత్స్యకారులు సంబంధిత శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నపించినా సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూపుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ వర్షాకాల సీజన్ లోనే నీరంతా బయటికి పోయి యాసంగి సాగు ప్రశ్నార్థకం అవుతుందని చెరువు చుట్టుపక్కల రైతులు, చెరువు పై ఆధారపడిన రైతులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాఅధికారులు స్పందించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని, దామెర చెరువు నీరు వృథా కాకుండా చేసి రైతులు, మత్స్యకారులకు సహకరించాలని కోరుతున్నారు.
శెనార్తి మీడియా,శంకరపట్నం