mother
mother

Mohter Death :బిడ్డ పుట్టిన రోజునే.. తల్లి అనంత లోకాలకు

  • అమ్మా లే.. అంటూ మృతదేహం వద్ద నాలుగేళ్ల చిన్నారి రోదన
  • చిన్నారికి ఎలా చెప్పాలో తెలియక తల్లడిల్లుతున్న తండ్రి
  • చిన్నారిని రోదనకు కంట తడిపెట్టిన కుటుంబ సభ్యులు, బంధువులు

Mohter Death :తెల్లారి కూతురు బర్త్ డే అని  ముందురోజే ఆ తల్లిదండ్రులు షాపింగ్ చేశారు. బిడ్డకు కావాల్సిన  డ్రెస్సులు, బొమ్మలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి  తీసుకువచ్చారు.  చిన్నారి పుట్టిన రోజున స్కూల్ కు వెళ్లి చాక్లెట్లు కూడా పంచిపెట్టారు. కానీ అంతలోనే తల్లికి చిన్నగా జ్వరం రావడంతో   స్థానికంగా ఉండే పీఎంపీ దగ్గరకు వెళ్లారు.  కానీ పీఎంపీ నిర్వాకంతో ఓ తల్లి అసువులు బాసింది. భార్య మృతి చెందిన విషయాన్ని చిన్నారికి తెలియకుండా ఉంచేందుకు గుండెల్లో దాచుకున్నాడు. చివర చూపు చూసేందుకు వచ్చిన బంధువులు ఈ దృశ్యాలను చూసి కన్నీరు మున్నీరైన సంఘటన సంఘటన నస్పూర్ మండలంలో చోటుచేసుకుంది.

పీఎంపి వైద్యం వికటించి మహిళ మృతి…
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పీఎంపీ వైద్యం వికటించి ఆదివారం ఓ గృహిణి మృతి చెందింది. నస్పూర్ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన చింతం శ్రీలత(24)కు రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా ఉండే ఓ పీఎంపీ వద్దకు వెళ్లారు. జ్వరం తీవ్రత గమనించకుండా పీసీఎం (పారాసిటమల్) ఇంజక్షన్ వేశాడు. అనంతరం మరో ఇంజక్షన్ వేయడంతో శ్రీలతకు చలితోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. గమనించిన భర్త రాజు మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు, అక్కడి నుంచి కరీంనగర్, హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ఆదివారం సాయంత్రం శ్రీలత మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కాగా బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పిన వెంటనే పీఎంపీ ప్రశాంత్‌తో పాటు ఆయనను తీసుకువచ్చిన మహాలక్ష్మీ మెడికల్ షాపు నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లే అమ్మా అంటూ తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న చిన్నారి
లే అమ్మా అంటూ తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న చిన్నారి

శోక సంద్రమైన కాలనీ…
చిన్న వయసులోనే శ్రీలత.. పీఎంపీ వైద్యానికి మృతి చెందగా నాలుగేళ్ల చిన్నారి అక్కడ జరుగుతుందో తెలియక అందరిని చూస్తూ ఉండిపోయింది. శ్రీలత మృతదేహం దగ్గరికి వచ్చి అమ్మ లే… అమ్మ లే… అంటూ పిలుస్తుండగా ఆ ఘటన చూసిన వారిని కన్నీరు పెట్టించాయి. తన తల్లి తన నుంచి శాశ్వతంగా వెళ్లిపోయిందని తెలియక ఆ చిన్నారి పిలుస్తుంటే తండ్రి నోట మాట రాక కన్నీళ్లు రాలాయి. తాను ఏడిస్తే తన పాప మరింత భయంతో బెంగటిల్లుతుందని భావించి బరువెక్కిన హృదయంతో మౌనంగా ఉండిపోయాడు. ఈ సంఘటనని కాలనీవాసుల్ని కలచివేసింది. అంతిమ యాత్రకు కుటుంబ సభ్యులు, రాజు స్నేహితులు, పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు తరలివచ్చారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *